Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్‌

టీమ్‌ఇండియా జట్టు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి మొదలైంది.

Updated : 13 Aug 2022 13:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ఇండియా జట్టు మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి మొదలైంది. ఆసియాకప్‌ కోసం 15 మంది సభ్యుల బృందాన్ని ఎంపికచేస్తే.. దీనిపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది. దీంతో తుది జట్టులో ఎవరిని ఆడిస్తారో అనే దానిపై చర్చ ఊపందుకుంది. తాజాగా దీనిపై ఓ క్రీడా ఛానల్‌తో భారత మాజీ క్రికెటర్‌ సబా కరీమ్ మాట్లాడాడు.

‘జట్టు మేనేజ్‌మెంట్‌ రిషభ్‌ పంత్ లేదా దినేష్ కార్తీక్‌లలో ఒకరిని తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారో అనేది ముందు నిర్ణయించుకొంటే.. నాలుగో స్థానాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌కు ఫిక్స్‌ చేయొచ్చు. జట్టులో ఐదుగురు బౌలర్లతోపాటు హార్దిక్ పాండ్యను ఆరో బౌలర్‌గా ఎంపికచేస్తే మంచిది. ఈ కాంబినేషన్‌ కాదని నెం7లో దినేష్ కార్తీక్‌ను ఆడించాలనుకుంటే.. హార్దిక్ చేత నాలుగు ఓవర్లు వేయించాల్సి ఉంటుంది. ఇది జట్టు మేనేజ్‌మెంట్‌ను ఇబ్బందిపెట్టే అంశం. వికెట్‌ కీపర్‌ కోటాలో పంత్ లేదా కార్తీక్‌లలో ఒకరిని ఆడిస్తే.. ఐదుగురు బౌలర్లు, ఆరో బౌలింగ్ ఆప్షన్‌తో వెళ్లొచ్చు. రోహిత్‌ కెప్టెన్సీ చూస్తే 5+1 వ్యూహాన్నే అనుసరిస్తున్నాడు. కాబట్టి పంత్, కార్తీక్‌లలో ఎవరిని ఆడిస్తారో నిర్ణయించుకోవాలి’ అని కరీమ్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని