జట్టులో ఉండాలనున్నా.. భయంగా ఉంది

భారత జట్టులోకి ఎంపికవ్వాలని ఉన్నా.. కుమార్తెకు దూరంగా ఉండాల్సి వస్తుందేమోనని భయంగా ఉన్నట్లు అగ్రశ్రేణి షూటర్‌ హీనా సిద్ధూ తెలిపింది. కొవిడ్‌-19, కుమార్తె జననంతో దాదాపు మూడేళ్లు ఆటకు దూరంగా ఉన్న హీనా..

Published : 28 Sep 2022 02:59 IST

పుణె: భారత జట్టులోకి ఎంపికవ్వాలని ఉన్నా.. కుమార్తెకు దూరంగా ఉండాల్సి వస్తుందేమోనని భయంగా ఉన్నట్లు అగ్రశ్రేణి షూటర్‌ హీనా సిద్ధూ తెలిపింది. కొవిడ్‌-19, కుమార్తె జననంతో దాదాపు మూడేళ్లు ఆటకు దూరంగా ఉన్న హీనా.. జాతీయ క్రీడల కోసం మళ్లీ పిస్టల్‌ పట్టింది. ‘‘జాతీయ క్రీడల్లో పాల్గొనడం మంచి అనుభూతి. కిందటి సారి పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించా. ఈసారి మహారాష్ట్ర తరఫున ఆడనున్నా. ప్రసవం తర్వాత శారీరకంగా చాలా మార్పొచ్చింది. దేహం నా మాట వినట్లేదు. చికాకుగా అనిపిస్తోంది. నెమ్మదిగా మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఎలాంటి తప్పులు చేస్తున్నానో నాకు తెలుసు. కాని వాటిని సరిదిద్దుకోలేకపోతున్నా. మళ్లీ భారత జట్టులోకి వెళ్లాలనుంది. కాని భయంగానూ ఉంది. జట్టుకు ఎంపికైతే శిక్షణ శిబిరంలో ఉండాలి.. కుమార్తె లేకుండా ప్రయాణాలు చేయాలి. అదే నన్ను భయపెడుతోంది’’ అని హీనా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని