Salaar: ప్రభాస్‌తో నటించడం అద్భుతం: శ్రుతిహాసన్‌

 ప్రభాస్‌ చాలా సరదాగా ఉంటారని, ఆయనతో కలిసి నటించడమనేది ఓ అద్భుతమని శ్రుతిహాసన్‌ అన్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ‘సలార్‌’.

Published : 29 Jun 2022 02:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) చాలా సరదాగా ఉంటారని, ఆయనతో కలిసి నటించడం ఓ అద్భుతమని శ్రుతిహాసన్‌ (Shruti Haasan) అన్నారు. ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’ (Salaar). ‘కేజీయఫ్‌’ (KGF) ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్‌ ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రభాస్‌, సినిమా గురించి మాట్లాడారు. ‘‘నాకు ప్రశాంత్‌ నీల్‌ చిత్రాలంటే చాలా ఇష్టం. తన కథలతో ఆయన ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంటారు. అలాంటి ప్రయాణంలో నేను భాగమైనందుకు సంతోషంగా ఉంది. చిత్ర బృందమంతా ఎంతో సహకారం అందిస్తోంది. ప్రభాస్‌తో కలిసి పనిచేయడం అద్భుతం’’ అని శ్రుతిహాసన్‌ తెలిపారు. ఈ చిత్రంలో తాను పోషిస్తున్న ఆద్య పాత్ర గురించి ఇప్పుడే ఏ వివరాలు బయటపెట్టలేనన్నారు.

సూపర్‌ హిట్‌ చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడం, ప్రభాస్‌ పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపిస్తారని తెలియడంతో ‘సలార్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ‘ఆదిపురుష్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌)తో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ‘అర్జున్‌ రెడ్డి’ ఫేం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’, మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. శ్రుతిహాసన్‌.. బాలకృష్ణ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి #NBK107 అనేది వర్కింగ్‌ టైటిల్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని