Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
నిఖిల్ నటించిన ‘కార్తికేయ-2’ ఎలా ఉందంటే..?
Karthikeya 2 Review చిత్రం: కార్తికేయ-2; నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యా మేనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్, తదితరులు; సంగీతం: కాలభైరవ; ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని; కళ: సాహి సురేష్; నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్; నిర్మాతలు: టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మెుండేటి; విడుదల తేదీ: 13-08-2022
ఈవారం ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’తో కలిపి వరుసగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో చివరిది ‘కార్తికేయ2’. విజయవంతమైన ‘కార్తికేయ’కు కొనసాగింపు కావడంతో ఆరంభం నుంచే ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ప్రచార చిత్రాలు కూడా అందుకు దీటుగా ఉండటం మరింతగా కలిసొచ్చింది. పలు అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే..?
కథేంటంటే: కార్తికేయ (నిఖిల్) (Nikhil) ఓ వైద్యుడు. ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. ప్రతి సమస్యకీ ఓ సమాధానం ఉంటుందని, తన దగ్గరికి రానంత వరకే ఏదైనా సమస్య అనీ.. వస్తే మాత్రం దానికి సమాధానం దొరకాల్సిందేనని అంటాడు. అందుకోసం ఎంతదూరమైనా ప్రయాణించే వ్యక్తిత్వం అతడిది. మొక్కు తీర్చడం కోసమని అమ్మతో కలిసి ద్వారక వెళతాడు. అనుకోకుండా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురికావడం, దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) ఎవరు? కార్తికేయ ప్రయాణానికీ, శ్రీకృష్ణతత్వానికీ సంబంధమేమిటనేది తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే: విజయవంతమైన ‘కార్తికేయ’(Karthikeya)కు కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. అయితే కథానాయకుడి పాత్ర, అతడి వ్యక్తిత్వం మినహా.. తొలి భాగం కథకీ, దీనికీ సంబంధమేమీ ఉండదు. ఈసారి శ్రీకృష్ణుడి చరిత్ర చుట్టూ కథను అల్లాడు దర్శకుడు. దైవం, మానవత్వం వంటి విషయాలను చెబుతూనే కథానాయకుడి సాహస ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో చిత్రబృందం సఫలమైంది. కథానాయకుడు ద్వారక వెళ్లినప్పట్నుంచీ కథలో వేగం పుంజుకుంటుంది. అప్పటివరకు భిన్న పాత్రల్ని, కథలో పార్శ్వాల్ని పరిచయం చేశాడు దర్శకుడు. హత్యకు గురైన ఆర్కియాలజిస్ట్, ఆయన చేసిన పరిశోధనల ఆధారంగా సమాధానాల్ని వెతుక్కుంటూ కథానాయకుడు వెళ్లే క్రమం ఆకట్టుకుంటుంది. ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, చోటు చేసుకునే అనూహ్య మలుపులు రక్తి కట్టిస్తాయి. ద్వితీయార్ధం నుంచి కథ మరింత బిగితో సాగుతుంది. మధుర గోవర్ధనగిరిలో గుహ, అక్కడ లభించిన ఆధారంతో ఆ ప్రయాణం మరో చోటుకి కొనసాగడం, అభీరా తెగతో కలిసి ప్రయాణం చేయడం, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు.. ఇలా ద్వితీయార్ధం అంతా కూడా ప్రేక్షకుల్ని కథలో లీనం చేస్తుంది. అక్కడక్కడా సినిమాటిక్ స్వేచ్ఛతో కథనాన్ని నడిపించినా.. వాణిజ్యాంశాల పేరుతో పాటలు, కామెడీ వంటి హంగుల్ని జోడించకుండా తెలివిగా చివరి వరకూ ఉత్కంఠ కొనసాగేలా చేశాడు దర్శకుడు. కొనసాగింపు చిత్రం కాబట్టి తొలి భాగానికి దీటుగా ఉండేలా.. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా విస్తృతమైన పరిధి ఉన్న కథని ఎంచుకోవడం కలిసొచ్చింది. కథా నేపథ్యం, దానికి తగ్గ సాంకేతిక హంగులు కూడా చక్కగా జోడించడం వల్ల కథ ఓ కొత్తదనాన్ని పంచుతుంది. పతాక సన్నివేశాలు మరో కథకి ఆరంభాన్ని సూచిస్తాయి.
ఎవరెలా చేశారంటే: నిఖిల్ తొలి సినిమాలో మెడికోగా ఎంత గాఢత కలిగిన పాత్రలో ఒదిగిపోయాడో.. ఈ సినిమాలోనూ అంతే. వైద్యుడిగా.. ప్రశ్న చుట్టూ ప్రయాణం చేసే వ్యక్తిగా.. ఈ కథని తన భుజాలపైనే మోశాడు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మేనన్ తదితరుల పాత్రలు కూడా ప్రభావం చూపిస్తాయి. శ్రీనివాస్‌రెడ్డి, వైవా హర్ష అక్కడక్కడా నవ్వించారు. తులసి, ప్రవీణ్, సత్య చిన్న పాత్రల్లో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం, కాలభైరవ సంగీతం చిత్రానికి ప్రాణం పోశాయి. కళా విభాగం కూడా చక్కటి పనితీరుని కనబరిచింది. దర్శకుడు చందు మొండేటికి ‘కార్తికేయ’ తొలి సినిమా. దాన్ని ఎంత శ్రద్ధగా, ప్రేమతో తీశారో ఈ సినిమాపై కూడా అంతే జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. నిర్మాణం బాగుంది.
బలాలు
+ కథా నేపథ్యం
+ కథనం
+ నిఖిల్ నటన
బలహీనతలు
- ఆరంభంలో కొన్ని సన్నివేశాలు
- సినిమాటిక్‌గా అనిపించే కొన్ని భాగాలు
చివరిగా: కార్తికేయ 2.. అలరించే మరో కొత్త ప్రయాణం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్