Crime News: వీడియోలు చేస్తోందని భార్యను చంపేశాడు!

సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తోందని ఆగ్రహించిన ఓ భర్త.. తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బిహార్‌ భోజ్‌పుర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల

Updated : 28 Sep 2022 07:13 IST

సోషల్‌ మీడియాలో వీడియోలు చేస్తోందని ఆగ్రహించిన ఓ భర్త.. తన భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన బిహార్‌ భోజ్‌పుర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నూ ఖాతూన్‌, అనిల్‌కు 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సోషల్‌ మీడియాలో అన్నూ వీడియోలు(రీల్స్‌) చేస్తుండేది. భార్య అలా చేయడం భర్తకు నచ్చలేదు. వీడియోలు చేయొద్దని ఆమెను కోరాడు. ఇందుకు అన్నూ నిరాకరించింది. దీంతో ఉద్రేకానికి గురైన అనిల్‌ భార్యను గొంతు నులిమి హత్యచేశాడు. సమాచారం అందుకున్న నవాడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని