Festive Offers: క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించిన‌ ఎస్బీఐ కార్డు!

కొన్ని ఎంపిక‌చేయ‌బ‌డ్డ వ‌స్తువుల‌పై 22.5% వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి.

Updated : 28 Sep 2022 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండుగ సీజ‌న్ కోసం ఎస్బీఐ కార్డు అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఆఫ‌ర్ల‌ను ప్రవేశ పెట్టింది. ఈ ఆఫ‌ర్లు అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో టైర్ 1, 2, 3కి చెందిన 2600 న‌గ‌రాల్లో 1600 కంటే ఎక్కువ వ‌స్తువుల‌పై ఈ ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్ల‌లో ఎల‌క్ట్రానిక్స్‌, మొబైల్స్‌, ఫ్యాష‌న్ అండ్ లైఫ్ స్టైల్‌, బంగారు ఆభరణాలు, ట్రావెల్ మార్కెట్ల‌లో అనేక ర‌కాల వ‌స్తువులు, సేవ‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఎంపిక‌చేసిన వస్తువుల‌పై 22.50% వ‌ర‌కు కూడా క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు ఉన్నాయి. 'అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్' కోసం SBI Card అమెజాన్‌తో ప్ర‌త్యేక భాగ‌స్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇంతేకాకుండా SBI Card.. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ మొబైల్‌, రిల‌య‌న్స్ ట్రెండ్స్‌, పాన్ట‌లూన్స్‌, రేమండ్స్‌, ఎల్‌జీ, సామ్‌సంగ్‌, సోని, హెచ్‌పీ, Make My Trip, goibibo వంటి ప్ర‌ఖ్యాత బ్రాండ్‌ల‌తో స‌హా దాదాపు 28 కీల‌క అంత‌ర్జాతీయ‌, దేశీయ బ్రాండ్‌ల కొనుగోళ్ల‌పై విభిన్న ఆఫ‌ర్ల‌ను పొందొచ్చు. ఎస్‌బీఐ కార్డు ఈఎంఐ సౌక‌ర్యాన్ని కూడా అందిస్తోంది. వినియోగ‌దారులు 25కు పైగా ఎల‌క్ట్రానిక్స్‌, మొబైల్ బ్రాండ్ల‌లో ఎటువంటి అద‌న‌పు వడ్డీ లేకుండా ఈఎంఐ సౌక‌ర్యాన్ని పొంద‌వ‌చ్చు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతీయ వ్యాపారుల వ‌ద్ద కూడా ఈఎంఐ లావాదేవీల‌పై 15% క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని