కథనాలు

గురి చూసి వదలండి మీ అస్త్రం
ఓటే బ్రహ్మాస్త్రం
నా ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకండి.
ఒక్క ఓటే ప్రగతికి సర్వస్వం కావొచ్చు.
ఒక్క ఓటే అక్రమాలను అంతమొందించే వజ్రాయుధం కావొచ్చు.
ఒకే ఒక్క ఓటు ఫలితాలను మార్చేసిన సందర్భాలెన్నో. ప్రపంచ గతినే మార్చిన దాఖలాలూ ఉన్నాయి. అందుకే నేను ఒక్కణ్ని ఓటేస్తే సమాజం మారిపోతుందా? ప్రభుత్వాలు నాకేం చేశాయని నేను ఓటెయ్యాలి? వంటి సాకులను పక్కనపెట్టి... నిట్టూర్పు, నిరాసక్తతలను మాని ప్రజాస్వామ్య యజ్ఞంలో భాగస్వాములవ్వండి
ఒక్క ఓటుతో..
బస్సు మిస్సైతే తర్వాతి బస్సుకు వెళ్లొచ్చు
రైలు తప్పితే మరో రైల్లో రావొచ్చు!
ఓటు వేయకుంటే మాత్రం మళ్లీ ఐదేళ్ల దాకా అవకాశం చేజారినట్లే
మనం ఒక్కరమే కదా అని అలక్ష్యం చూపితే.. ఐదేళ్ల పాటు నిర్లక్ష్యమైపోతాం!
ఒక్క ఓటే చరిత్రలో సంచలనాలు సృష్టించింది
ఒక్క ఓటుతో ప్రభుత్వాలు కూలాయ్‌.. నిలబడ్డాయ్‌
ఒక్క ఓటుతో ప్రాణాలు నిలిచాయ్‌.. పోయాయ్‌
ఒక్క ఓటుతో ప్రపంచమే మారింది.. ఇంకా మారుతుంది!

* 1999లో కేంద్రంలో వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతోనే కూలిపోయింది.
* ఒక్క ఓటు తేడాతో.. ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ అధికారిక భాషగా గుర్తింపు పొందింది.

* 2004లో కర్ణాటకలోని సంతెమరహళ్లి నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఎ.ఆర్‌.కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.

* 1776లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్‌ అధికార భాషగా మారింది.
* 1714లో ఒక్క ఓటు తేడాతో కింగ్‌జార్జ్‌-1 ఇంగ్లండ్‌ పీఠమెక్కారు.

* 1800లో థామస్‌ జెఫర్సన్‌, 1824లో జాన్‌ క్వీన్స్‌ ఆడమ్స్‌, 1876లో రూథర్‌ఫర్డ్‌ హెమ్స్‌లు ఎలక్టోరల్‌ కాలేజీలో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్ష పదవులను అధిష్ఠించారు.

* 1923 నవంబరు 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్‌ హిట్లర్‌ ప్రత్యర్థి ఓడిపోయారు! లేదంటే ప్రపంచ చరిత్రే వేరుగా ఉండేదేమో!

ఇప్పుడు మీకున్న ఒక్క ఓటు కూడా అంతటి శక్తి ఉన్నదే.
ఏమో మీ ఓటే సంచలనం సృష్టించొచ్చు. చరిత్ర గతినీ మార్చొచ్చు.
పదండి ఓటుకు.. పదండి పోలింగ్‌ బూత్‌కు!!!
2008 రాజస్థాన్‌ ఎన్నికల్లో ఒక్క ఓటు ఎంతపని చేసిందో తెలుసా?
2008 ఎన్నికల్లో రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషీ కాంగ్రెస్‌ని ముందుండి నడిపించారు. రేయనకా పగలనకా కష్టపడి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో జోషీ ఒకే ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. ఆయనకు 62,215 ఓట్లు రాగా ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి కల్యాణ్‌సింగ్‌ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటే ఆయన భవితవ్యాన్ని పూర్తిగా మార్చివేసింది. నిజానికి ఆ ఎన్నికల్లో జోషి తల్లి, భార్య, కారు డ్రైవరు.. ఈ ముగ్గురూ ఓటు వేయలేదు. పైపెచ్చు తన డ్రైవర్‌ను జోషియే ఓటేయకుండా ఆపారట. వాళ్ల మూడు ఓట్లూ పడి ఉంటే ఆయనే సీఎం అయ్యేవారు. ఒక్క ఓటు విలువ ఎంతో చెప్పేందుకు ఇంతకు మించి నిదర్శనమేంకావాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.