పోటీలో ప్రముఖులు

హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదమూడేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌‌(ఆర్‌ఎస్‌ఎస్‌)లో చేరిన ఓ బాలుడు తన అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, పట్టుదలతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆయనే మధ్యప్రదేశ్‌ 17వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. భారతీయ జనతా పార్టీ జనరల్‌ సెక్రటరీగా, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన నవంబరు 29, 2005 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని విదిశ నుంచి వరుసగా ఐదు సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. లాడ్లీ లక్ష్మీ యోజన, కన్యాదాన్ యోజన, జననీ సురక్షా యోజన లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు అందుకున్నారు. ప్రేమ్‌సింగ్‌ చౌహాన్‌, సుందర్‌బాయ్‌ చౌహాన్‌ దంపతులకు 1959, మార్చి 5న జన్మించిన శివరాజ్‌సింగ్‌.. భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ(తత్వశాస్త్రం)పట్టా అందుకున్నారు. వృత్తిరీత్యా ఆయనది వ్యవసాయ కుటుంబం.

రాజకీయ ప్రవేశం...
1975లో మధ్యప్రదేశ్‌లోని మోడల్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌కి మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1976-77 ప్రాంతంలో ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగానూ కొంత కాలం భోపాల్‌లో జైలు శిక్ష అనుభవించారు. మొదటిసారి 1990లో బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991లో నిర్వహించిన పదో లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా 1997-98 ప్రాంతంలో వివిధ రకాల కమిటీల్లో సభ్యుడిగా, మధ్యప్రదేశ్‌ భాజపా రాష్ట్ర జనరల్‌ సెక్రటరీగా సేవలు అందించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2000 నుంచి 2003 వరకు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఛైర్మన్‌ ఆఫ్‌ హౌస్‌ కమిటీ(లోక్‌సభ), భాజపా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బుద్నీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఉపఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. మూడు పర్యాయాలు మధ్యప్రదేశ్‌లో భాజపా అధికారం చేపట్టేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.

సంస్కరణలు...
ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితిని మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు, నీటి వనరుల పెంపు, రాయితీ ధరకు విద్యుత్‌ సరఫరా తదితర మార్గాల ద్వారా వ్యవసాయం వృద్ధి చెందేందుకు కృషి చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా దిగుబడి సాధించినందుకు గానూ వరుసగా నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘కృషి కర్మణ్‌’ అవార్డును అందుకున్నారు. మనిషి జీవన విధానంలో నదుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని చెబుతూ ‘నమామి దేవి నర్మదా’ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. తన నిబద్ధత, నిరాడంబరతతో చాలా సులువుగా ప్రజల్లో కలిసి పనిచేసినందుకుగాను అందరి మన్ననలు అందుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

అవార్డులు...
పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన విధానం మెరుగు పరిచేందుకు అవిరళ కృషిని చేసిన ఆయనకు సూర్యోదయ మానవతా సేవా బిరుదును ఇచ్చారు. ఈ బిరుదు అందుకున్న వారిలో ఈయన ఏడో వ్యక్తి.

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

ఎవరేమన్నారంటే...

 • ‘మహాకూటమిలోని పార్టీలు తెజస అధ్యక్షుడు కోదండరాంను కరివేపాకులా వాడుకుని పక్కన పెట్టారు’

  - కేటీఆర్‌

 • ‘కూటమిలో టికెట్‌ తెచ్చుకోలేని కోదండరాం తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేయగలరు. తెదేపా సహా వలసవాద పార్టీలను ఓడించాలని గతంలో పిలుపునిచ్చిన ఆయన నేడు చంద్రబాబుతో వేదిక ఎలా పంచుకున్నారు’

  - హరీశ్‌రావు

 • ‘రాహుల్‌ గాంధీ సీట్లు ఇవ్వొచ్చు.. చంద్రబాబు నోట్లు ఇవ్వొచ్చు.. ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలవని గుర్తుంచుకోవాలి. పొరపాటున కూటమికి ఓటేస్తే తెలంగాణ వనరులు పరాయి వాళ్ల పరమవుతాయి’

  - కేటీఆర్‌

 • ‘ మీ కారును ఎక్కడైనా నడిపించుకోండి.. కానీ రాజేంద్రనగర్‌కు మాత్రం రానివ్వకండి.. ఔటర్‌ రింగురోడ్డు మీదుగా అటునుంచి అటే వెళ్లిపోండి’

  - ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

 • ‘ సర్వేలను చూసి అతివిశ్వాసానికి పోయే ప్రసక్తే లేదు. గతంలో సర్వేల ఫలితాలు తారుమారు అయ్యాయి. సర్వేల ఆధారంగా మేము సన్నద్ధం కావడం లేదు’

  - జ్యోతిరాదిత్య సింధియా

 • ‘మోసగించడం కాంగ్రెస్‌ రక్తంలోనే ఉంది. అబద్ధాలు చెప్పడం, ద్వంద్వవైఖరి ఆ పార్టీ నైజాం’

  - ప్రధాని మోదీ

 • © 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
  Designed & Developed by Eenadu WebHouse
  For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
  Best Viewed In Latest Browsers

  Terms & Conditions   |    Privacy Policy

  Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.