ప్రధానాంశాలు

హరీశ్‌, రేవంత్‌లకు ఈసీ నోటీసులు
వంటేరు, రేవూరిలకు కూడా..

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నాయకులు పరస్పర మాటల యుద్ధంతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదులతో ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, వంటేరు ప్రతాప్‌ రెడ్డి, తెదేపా నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వారిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ నోటీసులకు 48గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

ఎన్నికల షెడ్యూల్

ఛత్తీస్‌గఢ్ నవంబరు 12 , 20
మధ్యప్రదేశ్‌ నవంబరు 28
మిజోరం నవంబరు 28
తెలంగాణ డిసెంబరు 7
రాజస్థాన్ డిసెంబరు 7
ఓట్ల లెక్కింపు డిసెంబరు 11

ఎవరేమన్నారంటే...

  • ‘మహాకూటమిలోని పార్టీలు తెజస అధ్యక్షుడు కోదండరాంను కరివేపాకులా వాడుకుని పక్కన పెట్టారు’

    - కేటీఆర్‌

  • ‘కూటమిలో టికెట్‌ తెచ్చుకోలేని కోదండరాం తెలంగాణ ప్రజలకు ఏం మేలు చేయగలరు. తెదేపా సహా వలసవాద పార్టీలను ఓడించాలని గతంలో పిలుపునిచ్చిన ఆయన నేడు చంద్రబాబుతో వేదిక ఎలా పంచుకున్నారు’

    - హరీశ్‌రావు

  • ‘రాహుల్‌ గాంధీ సీట్లు ఇవ్వొచ్చు.. చంద్రబాబు నోట్లు ఇవ్వొచ్చు.. ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలవని గుర్తుంచుకోవాలి. పొరపాటున కూటమికి ఓటేస్తే తెలంగాణ వనరులు పరాయి వాళ్ల పరమవుతాయి’

    - కేటీఆర్‌

  • ‘ మీ కారును ఎక్కడైనా నడిపించుకోండి.. కానీ రాజేంద్రనగర్‌కు మాత్రం రానివ్వకండి.. ఔటర్‌ రింగురోడ్డు మీదుగా అటునుంచి అటే వెళ్లిపోండి’

    - ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

  • ‘ సర్వేలను చూసి అతివిశ్వాసానికి పోయే ప్రసక్తే లేదు. గతంలో సర్వేల ఫలితాలు తారుమారు అయ్యాయి. సర్వేల ఆధారంగా మేము సన్నద్ధం కావడం లేదు’

    - జ్యోతిరాదిత్య సింధియా

  • ‘మోసగించడం కాంగ్రెస్‌ రక్తంలోనే ఉంది. అబద్ధాలు చెప్పడం, ద్వంద్వవైఖరి ఆ పార్టీ నైజాం’

    - ప్రధాని మోదీ

  • © 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
    Designed & Developed by Eenadu WebHouse
    For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
    Best Viewed In Latest Browsers

    Terms & Conditions   |    Privacy Policy

    Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.