ప్రధానాంశాలు

ఓటు ఇలా వేద్దాం

సంచార పోలింగ్‌ కేంద్రాలు
న్నికల్లో సాధారణంగా శాశ్వత భవనాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. కానీ మన దేశంలో సంచార పోలింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవడానికి ఓటర్లకు అధిక శ్రమ ఉండే ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్‌ వీటిని ఏర్పాటు చేస్తుంది. సంచార పోలింగ్‌ కేంద్రం సాధారణంగా వాహనంలో ఏర్పాటు చేస్తారు. ఈ వాహనం ముందుగా నిర్దేశించిన గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. ఆయా గ్రామాలకు ఇది ఏ సమయంలో వస్తుంది, ఎంత సమయం అక్కడ ఉంటుందనే సమాచారాన్ని ముందుగానే తెలియజేస్తారు. ఆయా గ్రామాలకు కేటాయించిన సమయంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ విధంగా రాజస్థాన్‌లో గత శాసనసభ ఎన్నికల్లో జైసల్మేర్‌ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆరు సంచార పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా పశ్చిమ్‌ బంగ రాష్ట్రంలో గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సుదూరంగా ఉన్న మారుమూల ద్వీపాల్లోనూ వీటిని ఏర్పాటు చేశారు. ఒక ద్వీపం నుంచి మరో ప్రాంతానికి పోలింగ్‌ సిబ్బందిని తరలించడానికి మోటార్‌ బోట్లు వాడారు.
- న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌ (మంచిర్యాల)

మరిన్ని