‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానం. వీవీప్యాట్‌ల్లోని స్లిప్‌లను కూడా లెక్కించాలి. ప్రజాకూటమి అభ్యర్థులంతా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి’
- టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
‘ప్రజలు భాజపాకి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది దేశ ప్రజల తీర్పు, గెలుపు.. ప్రజాస్వామ్య గెలుపు. అన్యాయం, దాడులు, వ్యవస్థల విధ్వంసం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం... పేదలు, రైతులు, యువత, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల కోసం ఏమీ చేయని పాలనపై గెలుపు’
- పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
‘ఈ ఎన్నికల ఫలితాలను రాహుల్ గాంధీకి కానుక ఇస్తాం. ఆయన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని ఆయనకు కానుకగా ఇస్తాం
- కాంగ్రెస్ నేత సచిన్ పైలట్
‘ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో కూర్చుని చర్చిస్తాం. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా? తెరాస అక్రమాలకు పాల్పడిందా? అనే విషయాలపై కూడా దృష్టిపెడతాం. రాష్ట్ర ప్రజలు తెరాసకు అనుకూలంగా ఉన్నట్లు ఈ ఫలితాలు వెల్లడిస్తుయి. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన ఉండి పోరాడతాం’
- కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్
‘గొప్పగా, గౌరవంగా ఉంది. కేసీఆర్ గారిపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. మీకు మరోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు
- కేటీఆర్